Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త - అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (10:20 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న పచ్చటి సంసారంలో చిచ్చురేగింది. దీంతో అత్తారింటిపై అలిగిన కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనసు మార్చుకుని తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ, ఏం జరిగిందో ఏమోగానీ, భర్త, అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. 
 
స్థానికంగా స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన యువతిని కరీంనగర్‌కు చెందిన వ్యాపారి సాయికృష్ణ (29) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 
అయితే, ఏడాది తర్వాతి నుంచే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. సాయికృష్ణ తరచూ భార్యను వేధించేవాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 9న రాత్రి 9 గంటల సమయంలో అత్తింటికి వచ్చిన సాయికృష్ణ చేతిలో సీసా ఉండడంతో దానిని యాసిడ్ అనుకుని భయపడిన భార్య తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మామతో వాగ్వివాదానికి దిగాడు.
 
అనంతరం సీసాలోని పెట్రోలును ఆయనపై పోసి అగ్గిపుల్ల గీసి అంటించాడు. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన ఆయన భార్య రమాదేవి కూడా స్పల్పంగా గాయపడ్డారు. 
 
ఆ వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన రమాదేవి, సాగర్‌రావును పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, ఈ ఘటనలో నిందితుడు సాయికృష్ణకు కూడా గాయాలయ్యాయని, స్నేహితుడితో కలిసి కరీంనగర్ వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments