Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడిని నమ్మి ఇంటికి తీసుకువస్తే, అత్తను లైన్లో పెట్టాడు, ఆ తరువాత

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (15:47 IST)
తన సొంత అక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆమె కొడుకుని తన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడో మామ. అయితే మామ చెప్పినట్టు వినాల్సిన ఆ అల్లుడు ఏకంగా అత్తనే లైన్లో పెట్టాడు. ఆమెతో సరస సల్లాపాల్లో మునిగితేలుతూ చివరకు మామకే అడ్డంగా దొరికిపోయాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు అతి దారుణంగా మామను అత్తతో కలిసి చంపేశాడు.
 
జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం మార్లబీడు గ్రామానికి చెందిన బంట్రోతు రంగారెడ్డి అనే వ్యక్తికి 32 యేళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్యంతో సంవత్సరం క్రితమే మొదటి భార్య చనిపోయింది. దీంతో రెండవ వివాహం చేసుకున్నాడు.
 
రెండు నెలల క్రితం అక్క రాజేశ్వరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం.. బావ చనిపోవడంతో ఆమె కొడుకు సుదర్సన్ రెడ్డిని తన ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంట్లోనే ఉంచి పనికి తీసుకెళ్ళేవాడు. రంగారెడ్డి మేస్త్రీ. సుదర్సన్‌ను కూలీగా తీసుకెళ్ళేవాడు.
 
అయితే గత 15 రోజుల నుంచి సుదర్సన్ అత్తను లైన్లో పెట్టాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. వారం క్రితమే ఈ విషయం రంగారెడ్డికి తెలిసింది. అల్లుడితో పాటు రెండవభార్యను మందలించాడు. అయితే భర్త చెప్పినట్లు వినాల్సిన భార్య ఏకంగా ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
 
నిద్రిస్తున్న రంగారెడ్డిని అతి దారుణంగా ఇద్దరూ కలిసి చంపేశారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే బంధువులకు అనుమానంతో కేసు పెట్టడంతో విచారణ జరిపి దారుణ హత్య అని నిర్ధారించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments