Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను మభ్యపెట్టి లేపుకెళ్లిన ప్రియుడి ఆచూకి కనుక్కుని అక్కడికెళ్లి...

Advertiesment
భార్యను మభ్యపెట్టి లేపుకెళ్లిన ప్రియుడి ఆచూకి కనుక్కుని అక్కడికెళ్లి...
, బుధవారం, 17 మార్చి 2021 (21:32 IST)
ఇద్దరు పిల్లల తల్లి. ఎన్నో బాధ్యతలు భుజాన వేసుకుని ముందుకు నడవాల్సిన పరిస్థితి. కానీ ఆ మహిళ మాత్రం పక్కింటి కుర్రాడిపై మనసు పడింది. అతను లేకుంటే జీవితమే లేదనుకుంది. అతనితోనే శృంగార జీవితం గడపాలనుకుంది. పెళ్ళయి 15 యేళ్ళు అవుతున్నా.. భర్త ఎంతో అన్యోన్యంగా చూసుకుంటున్నా పట్టించుకోని ఆ మహిళ యువకుడి కోసం తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది.
 
తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా నయినార్ కోవిల్ సమీపంలోని మనిచ్చియేందల్‌కు చెందిన సత్యేంద్రన్, వలర్మతిలకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా చేసిచేస్తున్నాడు సత్యేంద్రన్. సరిగ్గా ఆరునెలల క్రితమే మనిచ్చియేందల్ ప్రాంతలోని నాలుగో వీధికి వీరు మారారు.
 
బాడుగ ఇంటిలో చేరారు. ఆ ఇంటికి పక్కనే ఉన్న వేల్ రాజ్ వలర్మతికి దగ్గరయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఎంతో అందంగా ఉన్నావని, నీకు పిల్లలున్నారంటే నమ్మశక్యంగా లేదంటూ ఆకాశానికెత్తేశాడు. దాంతో ఆమె అతడి మాయలో పడిపోయింది.
 
మూడునెలల పాటు ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆమెను బాగా మభ్యపెట్టాడు. గత రెండురోజుల క్రితం ఆదివారం మధ్యాహ్నం ఆమెను బయటకు తీసుకెళ్ళిపోయాడు. భర్తకు అసలు విషయం తెలియదు. పిల్లల నుంచి విషయం తెలుసుకున్న భర్త ఆశ్చర్యపోయాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
 
అంతటితో ఆగలేదు. తన భార్యను లేపుకెళ్లిన అతడితోపాటు తన భార్యను స్నేహితుల సాయంతో చంపేయాలనుకున్నాడు. నలుగురు స్నేహితులను వెంటపెట్టుకున్న సత్యేంద్రన్ వలర్మతి ఉన్న ప్రాంతాన్ని గుర్తించాడు. తన భార్యపైనా ఐదుమంది కలిసి దాడి చేశారు. ఆ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పిస్తే చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకా, క్రూరుడా? తల్లి చెంపపై ఒకే ఒక్క దెబ్బ, ప్రాణాలొదిలేసింది