Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త శృంగార కోరికలను ఆసరాగా చేసుకుని.. నాలుగో భార్య రెచ్చగొట్టి..?

Advertiesment
భర్త శృంగార కోరికలను ఆసరాగా చేసుకుని.. నాలుగో భార్య రెచ్చగొట్టి..?
, మంగళవారం, 16 మార్చి 2021 (17:05 IST)
మహారాష్ట్రలోని నాగపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త సెక్స్ కోరికలను ఆసరాగా చేసుకుని అతని నాలుగో భార్య.. రెచ్చగొట్టి చేతులు కట్టేసి హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నాగపూర్‌కు చెందిన లక్ష్మణ్ మాలిక్ (65) అనే వ్యక్తి ఈఎస్ఐసీ ఆస్పత్రిలో పనిచేసేవాడు.
 
2011లో అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. డబ్బులకు కొదవలేదు. శృంగార కోరికలు ఎక్కువగా ఉన్న మాలిక్ మొత్తం 5 పెళ్ళిళ్లు చేసుకున్నాడు. నాగపూర్‌లో బోటిక్ నడిపే స్వాతి మాలిక్ అలియాస్ స్వాతిశర్మ (30) లక్ష్మణ్‌కు పరిచయం అయ్యింది.
 
ఈ పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. స్వాతిని నాలుగో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇంకో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మణ్ తన భార్యలను వేర్వేరు అద్దె ఇళ్లలో ఉంచి వారితో కాపురం చేసేవాడు. అయితే 2018లో స్వాతి శర్మ బోటిక్‌లో పనిచేసే ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు. అది గమనించిన స్వాతి ఆ పరిచయం మానుకోమని చెప్పింది. అయినా అతను వినకపోవటంతో అతడి నుంచి విడిగా వెళ్ళిపోయి జీవించసాగింది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
 
స్వాతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ లక్ష్మణ్ పెన్షన్ డబ్బులు డ్రా చేసుకుని వాడుకుంటోంది. ఇది అలుసుగా తీసుకుని తన కోరిక తీర్చమని లక్ష్మణ్ స్వాతిని వేధించసాగాడు. లక్ష్మణ్‌ను అడ్డుతొలగించుకుని.. పెన్షన్ మొత్తం తానే అనుభవించాలనుకుంది. అతడి సెక్స్ కోరికలే ఆయుధంగా అతడ్ని మట్టుపెట్టాలని ప్లాన్ వేసింది. శృంగార కోరికల ఆసరాగా.. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లోని కొన్ని పోర్న్ వీడియాలను చూపించి రెచ్చగొట్టింది.
 
మాలిక్ కూడా అందుకు ఒప్పుకుని చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. అయితే ప్లాన్ చేసిన ప్రకారం.. తనతోపాటు తెచ్చుకున్న నైలాన్ తాడుతో అతడి చేతులు రెండు వెనక్కి విరిచ్చి కట్టేసింది. కాళ్లు రెండు కదలకుండా కట్టింది. అతడ్ని కట్టేసిన తర్వాత తన బ్యాగులోంచి కత్తి తీసి కసితీరా పొడిచింది. ఆ కత్తిపోట్లకు లక్ష్మణ్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది.
 
ఆ తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కాళ్లు చేతులు కట్టిపడేసి, రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న లక్ష్మణ్‌ను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యుత్ రంగంలోనూ పోర్టబులిటీ.. త్వరలోనే అమలులోకి వస్తుందా?