Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్సరసను పెళ్ళి చేసుకున్నాననుకుని శోభనం గదిలోకి వెళితే..?

Advertiesment
husband
, బుధవారం, 17 మార్చి 2021 (19:36 IST)
ఆమె ఎంతో అందంగా ఉంది. పెద్దలను ఎదిరించాడు. కట్నం లేకపోయినా ఫర్వాలేదు. ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. చివరకు సింపుల్‌గా పెళ్ళి చేసేసుకున్నాడు. పెళ్ళి తరువాత మొదటిరోజు శోభనం గదికి వెళ్ళాడు. ఎంతకూ భార్య దగ్గరకు రాకపోవడం.. దూరం దూరం జరగడంతో మొదటిరోజు భయపడుతోందని సరిపెట్టుకున్నాడు. ఇలా మూడు నెలలు గడిచి అనుమానంతో వైద్యపరీక్షలు చేయించాడు.
 
తానొకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలుస్తాడన్న సామెత ఒకటి ఉంది. అలాంటిదే ఒక అభాగ్యుడికి జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని బడా బజార్లో నివాసముండే  ఒక యువకుడికి సహారన్ పూర్ ప్రాంతానికి చెందని యువతికి పెళ్ళి జరిగింది. 
 
పెళ్ళికి ముందు పెళ్ళిచూపులకు వెళ్ళిన యువకుడు ఆ యువతిని చూసి మైమరిచిపోయాడు. కళ్ళు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. ఇంట్లో వారు కట్నకానుకలు మాట్లాడుతుంటే ఒప్పుకోలేదు. కట్నం లేకపోయినా ఫర్వాలేదు. ఆమెనే పెళ్ళి చేసుకోవాలన్నాడు. 
 
కొడుకు ఇష్టపడుతున్నాడని ఆమెకే ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. శోభనం రోజు ఆమె ఇబ్బంది పడుతూ కనిపించింది. దీంతో ఆ యువకుడు ఆమెను అప్పటికి వదిలేసాడు. అలా మూడునెలలు గడిచాయి. అనుమానం వచ్చిన యువకుడు వైద్య పరీక్షలు చేయించాడు. ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలుసుకున్నాడు. అంతే షాకయ్యాడు.
 
నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసి పెళ్ళి చేసుకుందని ట్రాన్స్‌జెండర్ పైన ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరిని పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. అస్సలు ట్రాన్స్‌జెండర్‌తో వివాహం ఎందుకు చేశారో ఇప్పటికీ ఆ యువకుడికి అర్థం కావడంలేదట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు వెనుక నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే? (Video)