Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారు వెనుక నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే? (Video)

కారు వెనుక నుంచి రోడ్డుపై పడిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే? (Video)
, బుధవారం, 17 మార్చి 2021 (18:42 IST)
Boy
సిగ్నల్‌ వద్ద కదులుతున్న కారు వెనుక నుంచి ఒక బాలుడు రోడ్డుపై పడ్డాడు. గమనించిన మిగతా వాహనదారులు ఆ బాలుడికి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు తమ వాహనాలను నిలిపివేశారు. ఇంతలో ఆ బుడతడు లేచి రోడ్డుపై పరిగెత్తసాగాడు. 
 
స్కూటర్‌పై వెళ్తున్న ఒక మహిళ ఆ బాలుడ్ని పట్టుకుని నిలువరించింది. మరోవైపు బాలుడు కింద పడిన కారు నుంచి దిగిన ఒక మహిళ పరుగెత్తుకొని వచ్చి అతడ్ని ఎత్తుకుని తీసుకెళ్లింది. ఆ బాలుడికి ఏమీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోను ద సన్‌ తొలుత ప్రసారం చేయగా షిరిన్ ఖాన్ అనే మహిళ మంగళవారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. బాలుడికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంపై నెటిజన్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జొమాటో కేసు: ఆ యువతి పరారైందా? జొమాటో జోకులిక్కడ