Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు.. స్కార్పియో సీజ్

ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు.. స్కార్పియో సీజ్
, బుధవారం, 17 మార్చి 2021 (10:32 IST)
ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని వదిలి వెళ్లిన ఘటనలో ఎన్ఐఏ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తాజాగా సచిన్ వాజే కారును సీజ్ చేశారు. నలుపు రంగు మెర్సిడీజ్ కారును సచిన్ వాజే వాడేవాడు.
 
ఫిబ్రవరి 25వ తేదీన ముంబైలోని ముఖేశ్ అంబానీ బిల్డింగ్ యాంటిలా ముందు పేలుడు పదార్ధాలతో ఉన్న స్కార్పియో వాహనాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఆ కారులో ఓ బెదిరింపు లేఖను కూడా వదిలివెళ్లారు. అయితే ఆ వాహనం థానేకు చెందిన మన్సూక్ హీరేన్‌ది అని తేలింది. ఫిబ్రవరి 17వ తేదీన తన కారు మాయమైనట్లు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కానీ మార్చి 5వ తేదీన హీరన్ మృతిచెందాడు. సచిన్ వాజేనే తన భర్తను చంపినట్లు హీరన్ భార్య ఆరోపించింది. ప్రస్తుతం సచిన్ వాజేను అరెస్టు చేశారు. సచిన్ వాజే.. ఒసామా లాడెన్ కాదు అని, ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాలని సీఎం ఉద్దవ్ అన్నారు.
 
కాగా మార్చి 16వ తేదీన ఆ మెర్సిడీజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నుంచి 5 లక్షల నగదును, నోట్లు లెక్కబెట్టే మెషీన్‌తో పాటు అంబానీ ఇంటి ముందు ఉంచిన ఎస్‌యూవీ వాహన నెంబర్ ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నుంచి కొన్ని దుస్తులను కూడా ఎన్ఐఏ సీజ్ చేసింది. బ్లాక్ మెర్సిడీజ్ కారును సచిన్ వాడే నడిపేవాడు.. అయితే ఆ కారు ఓనర్ ఎవరన్న దానిపై విచారణ చేపడుతున్నట్లు ఎన్ఐఏ ఆఫీసర్ అనిల్ శుక్లా తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కతో కలిసి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తే.. పాము కాటేసింది.. ఎక్కడ?