Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మ జిల్లాలో రక్తమోడిన రహదారులు... ఆరుగురు దుర్మరణం

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (10:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రెండు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు ప్రమాదాలకు లారీలే కారణం కావడం గమనార్హం. జిల్లాలోని కొణిజర్ల వద్ద ఓ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వైరా మండలం విప్పలమడక వాసులుగా గుర్తించారు. 
 
మృతులను పారుపల్లి రాజేశ్, సుజాత దంపతులు, వీరి కుమారుడు అశ్విత్ (13)గా గుర్తించారు. హైదరాబాద్ నగంరోలని ఓ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న రాజేశ్.. వైరా మండలంలోని స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరికాసేపట్లో ఇంటికి చేరుతామనగా వారిని మృత్యువు కాటేసింది. దీంతో విప్పలమడకలో విషాద చాయలు అలముకున్నాయి. 
 
మరో ఘటనలో జిల్లాలోని పెనుబల్లి వీఎం బంజరలో జరిగింది. బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు చనిపోయారు. మూడో ఘటన కల్లూరు మండలం రంగంబంజరంలో జరిగింది. ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయితేజ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూడు ప్రమాదాలపై స్థానకి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments