Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ మర్డర్... తల్లిని, చెల్లిని చెరిచి చంపేస్తానన్నాడు.. అందుకే చంపేశా

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:26 IST)
వరుస హత్యలతో భాగ్యనగరం వణుకుతోంది. నడిరోడ్డుపై ప్రాణాలు తీస్తున్నా కాపాడే దిక్కే లేకుండా పోయింది. మొన్న ఎర్రగడ్డ, ఆ తర్వాత అత్తాపూర్ ఇప్పుడు పాతబస్తీ మీర్‌చౌక్‌లో ఆటో డ్రైవర్ హత్య... షాకీర్ ఖురేషికు మరో ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖాజాకు మధ్య విబేధాలున్నాయ్. తన తల్లిని, చెల్లిని అత్యాచారం చేసి చంపేస్తానని షాకీర్ చెప్పేవాడని.. దాంతో అతన్ని చంపేశానంటున్నాడు ఖాజా. 
 
నడిరోడ్డుపై ఆటో డ్రైవర్ షాకీర్‌ను కిందపడేశాడు. ఆ వెంటనే కత్తితో అతని గొంతు కోసేశాడు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా చాలాసేపు కత్తితో వేట్లు వేస్తుండగా.. అక్కడ చూస్తున్న జనం ఎవరూ అడ్డుకోలేదు సరికదా.. తమ సెల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేయసాగారు. ఓ పోలీస్ వచ్చి ఖాజాను అడ్డుకునేందుకు యత్నించినా కత్తితో అతన్ని బెదిరించాడు. చేసేది లేక పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 
 
కత్తి పోట్లతో రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు షాకిర్. హత్యకు గురైన షాకిర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. నిందితుడు ఖాజాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చాక పోలీసుల చేతుల్లో తుపాకులు కాదు కదా.. కనీసం లాఠీలు కూడా ఉండకపోవడంతో నేరస్తులు ఇలా రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments