Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో భారీ వర్షాలు... జనవాసాల్లోకి కొండచిలువ.. మొసలి

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (17:57 IST)
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం విలవిలలాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరద నీరు చేరుకోవడంతో బస్తీల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. 
 
తాజాగా పురానాపూల్ ప్రాంతంలోకి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దానిని పట్టుకొని సంచిలో వేసి బంధించారు. సాగర్‌లో కూడ ఓ మొసలి ప్రత్యక్ష్యం అయ్యింది. దీంతో జనాలు తమ ఇళ్లలోకి పాములు వస్తాయోని బయపడుతున్నారు.
 
అలాగే హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో టాలీవుడ్‌ మళ్లీ షూటింగ్‌లకి బ్రేక్ ఇచ్చింది. అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌ నుంచే షూటింగులు ఊపందుకున్నాయి. టాలీవుడ్‌ మోస్ట్ అవైటడ్ మూవీ 'ట్రిపుల్‌ ఆర్' కూడా లాంగ్‌ బ్రేక్‌ తర్వాత ఈ నెలల్లోనే సెట్స్‌కి వెళ్లింది. 
 
రవితేజ లాంటి మరికొంతమంది స్టార్లు కూడా ఈనెల్లోనే సెట్స్‌లో అడుగుపెట్టారు. అయితే క్రమంగా ఊపందుకుంటోన్న షూటింగులకి హైదరాబాద్‌లో పడుతోన్న భారీ వర్షాలతో బ్రేకులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం నుంచి కురుస్తోన్న భారీ వర్షాలతో రోడ్లు కాలవల్లా మారిపోయాయి. చాలా ప్రాంతాలు చెరువులని తలపిస్తున్నాయి. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉండడంతో షూటింగులకు బ్రేక్ ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. 
 
భారీ వర్షాలతో చాలా ఖర్చుపెట్టి కట్టిన సెట్స్‌ కూడా దెబ్బతింటున్నాయని బాధపడుతున్నారు నిర్మాతలు. కరోనా జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగులు రీ-స్టార్ట్ చేసుకుంటే ఈ అకాల వర్షాలతో కొత్త సమస్య వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments