Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నకు బై.. బై.. చెబుతూ ఓ చిన్నారి... స్కూలు బస్సు కింద...

రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో కళ్ల ముందే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె కన్నుమూసింది.. బోసి మాటలు, బుడిబుడి నడకలతో తిరిగే ఆ ఇంటి ఆనందం ఆవిరై పోయింది. స్కూలుకు వెళుతున్న తన అన్నకు ‘ బై.. బై..’ అంటూ చెప్పిన ఆ చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోయింది

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:05 IST)
రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో కళ్ల ముందే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె కన్నుమూసింది.. బోసి మాటలు, బుడిబుడి నడకలతో తిరిగే ఆ ఇంటి ఆనందం ఆవిరై పోయింది. స్కూలుకు వెళుతున్న తన అన్నకు  ‘ బై.. బై..’ అంటూ చెప్పిన ఆ చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోయింది. తల్లి చేయి వదిలి ముందుకు వెళ్లడంతో బడి బస్సు ఆద్య బోసి నవ్వును చిదిమేసింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం గోపిగడ్డలో చోటుచేసుకుంది.
 
గోపిగడ్డకు చెందిన మోముల చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సాత్విక్‌ షాబాద్‌లోని మాంటిస్సోరి పాఠశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలానే సోమవారం ఉదయం సాత్విక్‌ను పాఠశాల బస్సు ఎక్కించేందుకు లావణ్య తమ రెండేళ్ల కుమార్తె ఆద్యను రోడ్డుపైకి వచ్చింది. సాత్విక్‌ను బస్సు ఎక్కించే క్రమంలో ఆద్య చేయిని వదిలి పెట్టింది. 
 
ఈ లోపు ‘అన్నయ్యకు .. బై.. బై..’ అంటూ చిన్నారి ముందుకు వెళ్లింది. డ్రైవర్‌ బస్సును ముందుకు పోనివ్వడంతో చిన్నారి చక్రాల కింద పడిపోయింది. తలపై నుంచి చక్రాలు వెళ్లడంతో ఆద్య అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో షాక్‌కు గురైన లావణ్య ఒక్కసారిగా కుప్పకూలింది. చిన్నారి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, తల్లి లావణ్య  ‘ఆద్య.. ఆద్య’ అంటూ విలపిస్తూ గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవరును అదుపులోనికి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments