Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను తరిమేశాడని హత్య.. ముగ్గురికి జీవితఖైదు

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (11:40 IST)
శునకంతో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ కేసులో ఏడేళ్ల తర్వాత ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో నివసించే ప్రశాంత్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. 
 
ఓ రోజు అది శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లడంతో దానిని అతడు కొట్టి తరిమేశాడు. తాను పెంచుకుంటున్న శునకాన్ని కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రశాంత్ శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్నాడు.
 
శ్రీనివాస్‌పై పగ తీర్చుకోవాలని భావించాడు. అంతే శ్రీనివాస్‌ను ప్రశాంత్‌ చంపేశాడు. దీనికోసం స్నేహితుల సాయం కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పటాన్‌చెరు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
తాజాగా, వీరిని దోషులుగా తేల్చిన సంగారెడ్డి రెండో అడిషనల్ జిల్లా కోర్టు ముగ్గురికీ జీవిత ఖైదుతోపాటు రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments