Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగ‌ళ‌గిరిలో కార్ వాష్ లో ఇద్ద‌రు యువ‌కుల‌పై మూకుమ్మ‌డి దాడి

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (10:34 IST)
ఏపీ సీఎం, మాజీ సీఎం స‌హా, ప‌లువురు ప్ర‌ముఖులుండే మంగ‌ళ‌గిరి ప్రాంతంలోనే దొమ్మిలు జ‌రుగుతున్నాయి. అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుచరుల పేరుతో మంగళగిరి పట్టణంలో కొందరు యువకులు హాల్ చల్ చేశారు. వీరంగం సృష్టించారు. 
 
మంగ‌ళ‌గిరి పట్టణంలోని ఆటోనగర్ లోని టీ స్టాల్, కార్ వాషింగ్ పాయింట్ వద్ద కొందరు యువకులు ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాదాపు 20 మంది యువకులు ఆ ఇద్ద‌రిపై దాడి చేయ‌డంతో అక్క‌డి చుట్టుప‌క్క‌ల వారు హ‌డిలిపోయారు. ఆ ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీరా ఇది రాజకీయ ప్ర‌మేయంతో జ‌ర‌గ‌డంతో, గాయపడిన వారిని రాజీ చేసేందుకు మంగ‌ళ‌గిరి పట్టణ అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. 
 
 
కేసు నమోదు చేస్తున్నట్లు మంగ‌ళ‌గిరి పట్టణ పోలీసులు చెపుతుండ‌గా, పోలీసుల అదుపులోనే ఓ వ్య‌క్తి ఘర్షణకు పాల్పడ్డాడు. ఇలాంటి దొమ్మిల‌పై పోలీసులు దృష్టి పెట్టాల‌ని, పూర్తి స్థాయిలో ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో మరిన్ని ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని  స్థానికులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments