ఆమ్వే వంటి సంస్థలను ప్రోత్సహించవద్దు : అమితాబ్‌కు సజ్జనార్ వినతి

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:12 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబా బచ్చన్‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ విజ్ఞప్తి చేశారు. అమెరికాకు చెందిన ఆమ్వే వంటి కంపెనీలను ప్రోత్సహించవద్దని ఆయన హితవు పలికారు. ఈ మేరకు అమితాబ్‍‌తో సహా సెలెబ్రిటీలందరినీ ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. ఆమ్వే వంటి మోసపూరిత సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వీటి కార్యకలాపాలు మన దేశంలో సాగించేందుకు ఏమాత్రం సహకరించవద్దని కోరారు. 
 
దేశ సామాజిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఇలాంటి సంస్థలను ప్రోత్సహించవద్దని ఆయన అభ్యర్థించారు. దీంతో ఈ ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. అయితే, సజ్జనార్ గతంలోనూ సెలెబ్రిటీలకు ఇలాంటి సూచనలు చేశారు. క్యూనెట్ వంటి గొలుసుకట్టు సంస్థలను ప్రోత్సహించవద్దని ఆయన గతంలో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. ఇపుడు కూడా ఆమ్వే వంటి సంస్థలను ప్రోత్సహించవద్దని కోరారు. 
 
ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించిన పలు ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆమ్వే తన వస్తువులను మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తుందని గత యేడాది ఏప్రిల్ నెలలో ఎన్‍‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ సంస్థ అసలు లక్ష్యం వ్యాపారం కాదని గొలుసుకట్టు స్కీముల్లో ప్రజలను చేర్పించేందుకు ప్రయత్నింస్తుందని ఆరోపించిన ఈడీ.. అప్పట్లో ఆమ్వేకు చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

Rajamouli : క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం అంటూ మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి పోస్ట్

Rana: కాంత తర్వాత దుల్కర్ సల్మాన్ ను నటచక్రవర్తి అని పిలుస్తారు: రానా దగ్గుబాటి

Mammootty: లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో భ్రమయుగం ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments