Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో రూ.5లకే రుచికరమైన, నాణ్యమైన భోజనం.. ఎవరికంటే?

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:59 IST)
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగుల సహాయకుల కోసం 5రూపాయలకే రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని మూడు పూటలా అందించేందుకు తగిన కార్యాచరణను రూపొందించింది. 
 
దీంతో పేద, మధ్యతరగతి రోగుల గురించి ఆలోచించిన ప్రభుత్వం 25రూపాయల ఖర్చు అయ్యే భోజనం ఖరీదులో 19.25 రూపాయల రాయితీని ప్రభుత్వం భరిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 38.66కోట్ల అదనపు భారం పడనుంది. 
 
ఆర్ధికంగా వెనుకబడిన, పేదల సౌకర్యం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ తరహా సదుపాయం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. పది రోజుల్లో ఈ ఐదు రూపాయల భోజనం సదుపాయం అందుబాటులోకి రానుంది.
 
ఇందులో భాగంగా తొలివిడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రధాన ఆసుపత్రుల దగ్గర ఈసౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. రోజుకు 55,800 భోజనాలను రోగుల సహాయకులకు అందించేందుకు అంతా సిద్ధం చేసింది . దీని ద్వారా రోజుకు 18,600మందికి లబ్ది చేకూరనుంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments