Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో గుల్లగుల్ల, కోవిడ్ తర్వాత న్యుమోనియాతో బాధపడుతున్న రోగులు

కరోనాతో గుల్లగుల్ల, కోవిడ్ తర్వాత న్యుమోనియాతో బాధపడుతున్న రోగులు
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:12 IST)
కరోనావైరస్ శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్లిపోయినా ఆలోపు గుల్లగుల్ల చేసేస్తోంది. కరోనావైరస్ కాలంలో మ్యూకోర్మైకోసిస్, న్యుమోనియా వంటి పోస్ట్-కోవిడ్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కరోనా నుంచి బయట పడిన తర్వాత రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో న్యుమోనియా తలెత్తుతోంది. ఇది చాలా ప్రమాదకరమైనది, ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఇది ప్రమాదకరంగా మారుతోంది.

 
వైద్య నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం... కోవిడ్ తర్వాత న్యుమోనియా రెండవ అత్యంత సాధారణ సమస్యగా మారుతోంది. కరోనరీ హార్ట్ డిసీజ్ తర్వాత న్యుమోనియా ఉంటే దానిని విస్మరించకూడదంటున్నారు. కరోనా తర్వాత దేశంలో ఫంగల్ న్యుమోనియా రోగుల సంఖ్య వేగంగా పెరిగింది.

 
ఈ న్యుమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి కారణమవుతోంది. ఇది పరీక్షలలో స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అనేక మంది మరణాలలో తీవ్రమైన న్యుమోనియా కూడా కారణంగా తేలింది. అదే సమయంలో న్యుమోనియా, సెప్సిస్ ఒక వ్యాధి. రోగికి సెప్సిస్ ఉంటే అది న్యుమోనియాను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది.

 
30% వరకు మరణాలు న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరినవారిలో 5 నుండి 10 శాతం మందిని చంపగలదని వైద్యులు చెపుతున్నారు. తీవ్రమైన రోగులను ఐసియులో ఉంచి చికిత్స అందించాలి. ఎందుకంటే న్యూమోనియా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య 30% వరకు వుంటోంది. రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థ ఈ వ్యాధికి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అందుకే వృద్ధులలో న్యుమోనియా ప్రమాదకరం.

 
వృద్ధులలో రోగనిరోధక శక్తి అంతగా ఉండదు. చాలాసార్లు వ్యాధి సోకినప్పుడు మందులు ఇస్తారు, అవి వ్యాధితో పోరాడుతాయి. అయితే వ్యాధితో పోరాడటానికి శరీరంలో అవసరమైన రోగనిరోధక శక్తి కూడా చాలా ముఖ్యం. మందులు వ్యాధితో పోరాడటానికి సహాయపడతాయి. అయితే దానికి కూడా శరీరం తోడు కావాలి. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు శరీరం దానికి తగిన విధంగా స్పందించదు. ఫలితంగా శరీరంలో సంబంధిత వ్యాధులు ప్రబలుతాయి. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు.

 
కరోనా తర్వాత, అనేక అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉంది. దీనిని సాధారణంగా న్యుమోనియా అంటారు. దీని అర్థం కొరోనరీ హార్ట్ డిసీజ్ యొక్క తదుపరి అత్యంత తీవ్రమైన రూపం న్యుమోనియా. దీని వల్ల ఊపిరితిత్తులకు చాలా నష్టం వాటిల్లుతుంది. అటువంటి సందర్భాలలో రికవరీ చాలా నెలలు పట్టవచ్చు.

 
ఒక వ్యక్తి దగ్గుతో పసుపుపచ్చ కళ్లె పడుతున్నప్పుడు, అధిక జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న సందర్భంలో న్యుమోనియా వచ్చినట్లు అనుమానించక తప్పదు. ఈ సందర్భంలో రోగి ఛాతీకి ఒక వైపు లేదా రెండు వైపులా నొప్పిని అనుభవించవచ్చు. కొన్నిసార్లు అధిక జ్వరం ఉండదు కానీ రెండు ఇతర లక్షణాలు ఉండే అవకాశం వుంది. న్యూమోనియా ఊపిరితిత్తులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మజ్జిగ, లస్సి తాగితే ప్రయోజనాలు ఏమిటి?