దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా వైరస్ సోకిన బాధితుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ఈ విషయాన్ని స్పష్టంచేసింది.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.60 లక్షల మేరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 3 శాతం తక్కువ అని తెలిపింది. అయితే, కరోనా మరణాల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతుంది. ఈ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
తాజా నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1,61,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,16,30,885కు చేరుకుంది. ఇందులో 3,95,11,307 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 16,21,603 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,97,975 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 2,81,109 మంది కోలుకోగా 1733 మంది మరణించడం ఆందోళన కలిగిస్తుంది.