Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మందార టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు...

మందార టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు...
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:20 IST)
మందార టీ ఆరోగ్యాన్ని పెంచేదిగా చెపుతుంటారు. అంతేకాదు సహజంగా బరువు తగ్గించే బూస్టర్ అయినప్పటికీ, తెలుసుకోవలసిన దుష్ప్రభావాలు ఉన్నాయి. మందార టీ తాగేవారిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి.

 
హైబిస్కస్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు రక్తపోటును తగ్గించడం. అందువల్ల ఇప్పటికే తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ ఉన్న వ్యక్తులకు ఇది సిఫార్సు చేయబడదు. అలాంటివారు మందార టీ తాగితే మూర్ఛ, మైకము కలిగించవచ్చు. తక్కువ రక్తపోటు ఉన్నవారు ఎవరైనా తీసుకుంటే గుండె లేదా మెదడుకు కూడా హాని కలిగించవచ్చు.

 
గర్భం- సంతానోత్పత్తిపై మందార టీ ప్రభావం వుందని ఇటీవలే ఓ కథనంలో ప్రచురించబడింది. దాని ప్రకారం, గర్భిణీ స్త్రీలకు మందార టీ సిఫార్సు చేయబడదు. ప్రత్యేకించి దాని ప్రభావాల కారణంగా, ఇది గర్భాశయం లేదా పెల్విక్ ప్రాంతంలో ఋతుస్రావం లేదా రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

 
అంతేకాదు మందార టీ వల్ల వణుకు, మలబద్ధకం మరియు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. హార్మోన్ల చికిత్సలు లేదా గర్భనిరోధక మాత్రలు తీసుకునేవారు, ఈ రకమైన టీని తీసుకోవడం గురించి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలని సిఫార్సు చేయబడింది.

 
మధుమేహం వున్నవారి విషయంలో.... మందార రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది కాబట్టి మధుమేహంతో బాధపడుతుంటే లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

 
మందార టీ తాగిన తర్వాత కొంతమందికి మత్తు లేదా మైకంలోకి వెళ్లవచ్చు. అందువల్ల, శరీరం టీకి ఎలా స్పందిస్తుందో తెలుసుకునే వరకు జాగ్రత్తగా ఉండాలి. శరీరంపై దాని ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలిసే వరకు వాహనాన్ని నడపకూడదు. కొందరు వ్యక్తులు మందార టీని తీసుకున్నప్పుడు కళ్ళు దురద, సైనస్ లేదా జ్వరం వంటి అలెర్జీ ప్రతిచర్యలు కూడా కనబడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాదములతో మీ కుటుంబ ఆరోగ్యం: ఆయుర్వేద మరియు న్యూట్రిషనల్‌ సైన్స్‌ నుంచి అభ్యసించండి