Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

దేశంలో 2 లక్షలకు దిగువకు చేరిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Advertiesment
Covid Positive Cases
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:04 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిట్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా రెండు లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడచిన 24 గంటల్లో 1,72,733 కేసులు నమోదయ్యాయి. 
 
బుధవారం కూడా రెండు లక్షలకు దిగువనే నమోదైన విషయం తెల్సిందే. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 25,59,107 మంది బాధితులు కోలుకున్నారు. అదేవిధంగా గత 24 గంటల్లో 1,008 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నెల ఆరో తేదీ నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ జట్టుతో ఆడే భారత క్రికెట్ జట్టును కూడా ఇటీవల బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. అయితే, భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. పలువురు క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 15,33,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా హోం క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశంలో 4,98,983 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్