Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వృద్ధుడు.. ఓ మహిళ అక్రమ సంబధాల గుట్టువిప్పిన రోలెక్స్ వాచ్!!

Webdunia
బుధవారం, 13 మే 2020 (12:11 IST)
ఓ వృద్ధుడు, ఓ మహిళ పెట్టుకున్న అనేక అక్రమ సంబంధాలను ఓ రోలెక్స్ వాచీ బహిర్గతం చేసింది. ఆ స్త్రీపురుషుడి బాగోతం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన 70 యేళ్ల వృద్ధుడు ఒకరు బంజారా హిల్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చాడు. 20 లక్షల రూపాయల విలువ చేసే వాచీ చోరీకి గురైందని ఆ వృద్ధుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. ఆ వాచ్‌ను చోరీ చేసింది ఆ వృద్ధుడి ప్రియురాలే అని తేలింది. ఇందుకోసం ఆ మహిళ మరో ప్రియుడి సహాయం కూడా తీసుకున్నట్టు తేలింది. ఇంతటితో ఈ కేసు ముగిసిపోలేదు. 
 
తాను వాచీ చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించడంతోనే ఆ మహిళ తిరగబడింది. తనపై వృద్ధుడు అత్యాచారం చేశాడంటూ అదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి తామిద్దరం ఏకాంతంకంగా గడిపిన ఫోటోలు, వీడియో ఆధారాలను పోలీసులకు సమర్పించింది. 
 
ఆ తర్వాత వృద్ధుడు వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో వృద్ధుడు ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తేలింది. వీరిలో తన రోలెక్స్ వాచీని చోరీ చేసిన యువతి కూడా ఉంది. అంతేకాదండోయ్.. ఆ మహిళ కూడా ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తంమీద వృద్ధుడు, మహిళ అక్రమ రంకుబాగోతాన్ని రోలెక్స్ వాచీ బయటపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments