Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్బీ నగర్‌లో కొంప ముంచిన బర్త్‌డే పార్టీ - 45 మందికి కరోనా

Advertiesment
ఎల్బీ నగర్‌లో కొంప ముంచిన బర్త్‌డే పార్టీ - 45 మందికి కరోనా
, ఆదివారం, 10 మే 2020 (17:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టే పట్టి.. తిరిగి పుంజుకున్నాయి. అయితే, ఈ కేసులన్నీ కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోనే నమోదవుతున్నాయి. 
 
ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ వనస్థలిపురం ఏరియాలో ఈ కరోనా వైరస్ స్వైర విహారం చేసింది. ఇక్కడ నమోదైన కేసుల్లో 45 కేసులు కేవల ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. వీరందరూ ఓ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఫలితంగా వీరందరికీ ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇటీవల సరూర్ నగర్ నివాసికి మలక్‌పేట్ గంజ్‌లో ఓ దుకాణం ఉంది. అప్పటికే ఆ వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకింది. ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. 
 
ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో రెండు కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది. కొత్త కేసులు నమోదు కావడమే కాదు, ఎల్బీ నగర్ ఏరియాలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లు కూడా ఏర్పడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో కరోనా : 2 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు