కాంగ్రెస్ వరి దీక్ష : ఒకే వేదికపై రేవంత్ - కోమటిరెడ్డి

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (14:44 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలకు పూనుకుంది. ఇందులోభాగంగా, శనివారం నుంచి వరి దీక్షను చేపట్టింది. ఈ దీక్షను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టారు. ఇక్కడ విశేషమేమిటంటే.. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరిదీక్షకు ఆ పార్టీ నేతలంతా సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా, రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు రేవంత్, కోమటిరెడ్డి ఇద్దరూ హాజరయ్యారు. ఆ ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొన్నారు. 
 
కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌లోకి అడుగుపెట్టలేదు. ఆయనపై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల దారుణ ఓటమిపై కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమిటిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం