Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి శవం ముందు ఐదేళ్ల చిన్నారి... కేటీఆర్‌కు ట్యాగ్.. రంగంలోకి కలెక్టర్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (22:41 IST)
Child
తల్లి శవం ముందు ఐదేళ్ల చిన్నారి కూర్చున్న ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ మరో జీవితాన్ని అందించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. 
 
గ్రామానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి తల్లి మంగళవారం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికే తండ్రి కూడా మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో తల్లి శవం ముందు దీనంగా కూర్చున్న చిన్నారి ఫొటోను ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోను గంటెపాక శ్రీకాంత్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ''ప్రభుత్వం ఈ ఐదేళ్ల చిన్నారి బాధ్యతలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని'' మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు.
 
ఆ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీకి ట్యాగ్ చేసి చిన్నారి బాగోగులు చూడాలని ట్వీట్ చేశారు. దీంతో కలెక్టర్ సహా, జిల్లా యంత్రాంగం ఎడ్‌బిడ్ గ్రామానికి వెళ్లి చిన్నారిని కలిసి పరామర్శించారు. 
Child
 
వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులు చిన్నారిని దత్తత తీసుకున్నట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ప్రకటించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చిన గంటెపాక శ్రీకాంత్‌ను ఆ జిల్లా ప్రజలు, నెటిజన్లు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments