మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ మరోసారి తల్లి కాబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య కలిసి బయటకు వచ్చిన సమయంలో కొంతమంది ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆమెకు అభిషేక్ అడ్డుగా వచ్చాడు.
ఐశ్వర్య రాయ్ కూడా ఓ పెద్ద బ్యాగ్ ను అడ్డం పెట్టుకున్నారు. ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ తన పొట్ట భాగాన్ని కంటపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అది చూసి నెటిజన్స్ మాత్రం మరో వారసుడు రాబోతున్నాడు అంటూ కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ వారసుడు రాబోతున్నాడా లేదా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్‌లో నటించింది. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది.