Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు : రేణుక దంపతులపై వేటు

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (07:48 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) పోటీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన రేణుక దంపతులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఈ కేసులో ఏ3 నిందితురాలుగా ఉన్న రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌లను ఉద్యోగాల నుంచి అధికారులు తొలగించారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె భర్త ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఈ ఇద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. 
 
వనపర్తి జిల్లా గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచరుగా పని చేస్తున్నారు. డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. చంచల్‌‍గూడ జైలుకు తరలించారు. 
 
ఈ పేపర్ లీకైనప్పటి నుంచి ప్రధాన సూత్రధారి ప్రణీణ్, రాజశేఖర్‌లతో పాటు రేణు, డాక్యా నాయక్ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, ఇపుడు ప్రభుత్వ అధికారులు వారిద్దరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. కాగా, ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments