Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 14 March 2025
webdunia

ఏపీ అసెంబ్లీలో 12 మంది టీడీపీ సభ్యులు - వైకాపా ఎమ్మెల్యే సస్పెన్షన్

Advertiesment
ap assembly
, బుధవారం, 15 మార్చి 2023 (16:09 IST)
ఏపీ అసెంబ్లీలో బుధవారం తెలుగుదేశం పార్టీతో పాటు వైకాపా ఎమ్మెల్యే ఒకరు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల్లో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియను చుట్టుముట్టి నినాదాలు చేసారు. దీంతో వారిని కూడా సస్పెండ్ చేశారు. ఫలితంగా మొత్తం 12 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. వీరిని మార్షల్స్ బయటకు పంపించారు. అలాగే, ఇటీవల వైకాపా నుంచి సస్పెండ్‌కు గురైన నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఈయన్ను కూడా సెషన్స్ మొత్తానికి స్పీకర్ సస్పెండ్ చేశారు. 
 
అంతకుముందు సీఎం కోసం గవర్నర్ నిరీక్షించారని, సీఎం పెద్దా? గవర్నర్ పెద్దా? అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. స్పీకర్ కార్యాలయంలో గవర్నర్ వేచి ఉండేలా చేశారని ఆరోపించారు. దీంతో జగన్ స్వయంగా గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ప్రభుత్వం సభలో ప్రదర్శించింది. పయ్యావుల కేశవ్ ఆరోపణలపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. 
 
ఆ తర్వాత సభలో తీర్మానాన్ని బుగ్గన ప్రవేశపెట్టారు. సభా సమయం వ‌ృథా చేశారంటూ పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని స్పీకర్ చదివి వినిపించారు. వాయిస్ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు. వారిద్దరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
దీంతో స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. దేనికి సస్పెండ్ చేశారంటూ స్పీకర్‌ను ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తేనే సభ నడుస్తుందని మంత్రి అంబటి రాంబాబు సూచించడంతో బుగ్గన రాజేంద్రనాథ్ మరో తీర్మానం ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు నిమ్మల, పయ్యావులపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, మిగతా సభ్యులను ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశామని స్పీకర్ చెప్పారు.
 
మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు అడ్డు తగులుతున్నాడని భావించిన వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి బుగ్గన ఓ తీర్మానం ప్రవేశపెట్టగా, మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఎండీ రైజెన్‌ 7000 సిరీస్‌ ల్యాప్‌టాప్‌లతో కన్స్యూమర్‌ నోట్‌బుక్‌ శ్రేణిని విస్తరించిన అసుస్‌