Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏఎండీ రైజెన్‌ 7000 సిరీస్‌ ల్యాప్‌టాప్‌లతో కన్స్యూమర్‌ నోట్‌బుక్‌ శ్రేణిని విస్తరించిన అసుస్‌

Asus
, బుధవారం, 15 మార్చి 2023 (16:01 IST)
అసుస్‌ తమ కన్స్యూమర్‌ నోట్‌బుక్‌ శ్రేణిని ఏఎండీ రైజెన్‌ 7000 సిరీస్‌తో భారతీయ మార్కెట్‌లో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. యువ ప్రొఫెషనల్స్‌, వ్యాపారవేత్తలు, లైఫ్‌స్టైల్‌ ప్రియుల కోసం విడుదల చేసిన ఈ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లలో ప్రతిష్టాత్మకమైన జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీతో పాటుగా వివోబుక్‌ సిరీస్‌, తాజా వివోబుక్‌ గో శ్రేణి సైతం ఉంది. నూతన జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ ప్రారంభధర 89,990 రూపాయలు కాగా వివోబుక్‌ గో 14 ధర 42,990 రూపాయలు. వివోబుక్‌ గో 15 ఓఎల్‌ఈడీ ప్రారంభ ధర 50,990 రూపాయలు కాగా, వివోబుక్‌ 15 ఎక్స్‌ ఓఎల్‌ఈడీ ప్రారంభ ధర 66,990 రూపాయలు.
 
అసుస్‌ ఇప్పుడు వివోబుక్‌ క్లాసిక్‌ ఫ్యామిలీని సైతం వివోబుక్‌ 14/15 ఓఎల్‌ఈడీ మరియు వివోబుక్‌ 16 మోడల్స్‌ను ప్రారంభ ధర 55,990 రూపాయలలో విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లను ఆన్‌లైన్‌లో(అసుస్‌ ఈ-షాప్‌/అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌), ఆఫ్‌లైన్‌(అసుస్‌ ప్రత్యేక స్టోర్లు/ఆర్‌ఓజీ స్టోర్స్‌/ క్రోమా/విజయ్‌ సేల్స్‌/రిలయన్స్‌ డిజిటల్‌)లో విక్రయిస్తున్నారు. ఈ జెన్‌ బుక్‌ 14 ఓఎల్‌ఈడీలో తాజా ఏఎండీ రైజెన్‌ 7030 సిరీస్‌ ప్రాసెసర్లు 28వాట్‌ పెర్‌ఫార్మెన్స్‌, 8 కోర్స్‌ వరకూ కలిగి ఉన్నాయి. ఈ వివోబుక్‌ శ్రేణిలో ఏఎండీ యొక్క నూతన రైజెన్‌ 7020 సిరీస్‌ ప్రాసెసర్లు ఉన్నాయి.
 
ఈ విడుదల సందర్భంగా అర్నాల్డ్‌ సు, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘2023లో  భారతదేశంలో కన్స్యూమర్‌ నోట్‌బుక్‌ విభాగంలో నెంబర్‌ 1 స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో మేము తాజా సాంకేతిక ఆవిష్కరణలను విభిన్న విభాగాల వ్యాప్తంగా విడుదల చేశాము. గత కొద్ది సంవత్సరాలుగా, పీసీ పరిశ్రమ అసాధారణ వృద్దిని భారతదేశంలో నమోదుచేస్తుంది. నేడు, మేము మా ప్రతిష్టాత్మక ల్యాప్‌టాప్‌ల శ్రేణి విడుదల చేశాము. ఇవి సాటిలేని పనితీరు, పోర్టబిలిటీ, భారతదేశపు బడ్జెట్‌ నోట్‌బుక్‌ మార్కెట్‌కు విలువను జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ, వివోబుక్‌ గో సిరీస్‌, వివోబుక్‌ క్లాసిక్‌ ఫ్యామిలీని నూతన  ఏఎండీ రైజెన్‌ 7000 సిరీస్‌తో పునరుద్ధరించడం ద్వారా అందిస్తాయి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓపెన్ AI ChatGPT GPT-4 కొత్త వెర్షన్‌ గురించి తెలుసా?