Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

అసుస్ నుంచి ఇ-స్పోర్ట్స్‌ ప్రియుల కోసం అత్యుత్తమ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌

Advertiesment
Laptop
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (11:42 IST)
ఆసుస్‌ ఇండియా రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌ఓజీ) నేడు తమ అసుస్‌ ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 17 పీసీలకు నూతన అప్‌గ్రేడ్స్‌ను జోడించి భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్పెషల్‌ ఎడిషన్‌ (ఎస్‌ఈ) విడుదల చేసినట్లు వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా, అత్యున్నత గేమింగ్‌ అనుభవాలకు ప్రతిరూపంగా స్ట్రిక్స్‌ స్కార్‌ను వెల్లడిస్తున్నారు. ఈ అప్‌గ్రేడ్స్‌ను పనితీరు మరియు కూలింగ్‌ యంత్రాంగం పరంగా చేయడం ద్వారా ఈ భావనను మరింత సుస్థిరం చేస్తుంది.

 
ఈ పీసీలలో అత్యున్నతమైన ఇంటెల్‌ 12వ తరపు కోర్‌ ఐ9 హెచ్‌ఎక్స్‌ సిరీస్‌ ప్రాసెసర్లు ఉన్నాయి. దీనిలో 65 వాట్‌ వరకూ టీడీపీ లెవల్స్‌, అత్యంత ఆకర్షణీయమైన 16 కోర్స్‌ కౌంట్‌, 24 త్రెడ్స్‌- 5గిగా హెర్ట్జ్‌ వరకూ వేగం పెంచగల సామర్థ్యం ఉండటం వల్ల మీరు విసిరే ఎలాంటి సవాల్‌నైనా అధిగమించగలదు. ఈ ల్యాప్‌టాప్‌ను సాటిలేని పనితీరు, గేమ్‌ప్లేను అందించే రీతిలో తీర్చిదిద్దారు. తద్వారా గేమింగ్‌ ప్రియులు, ఈస్పోర్ట్స్‌ ప్లేయర్లు తమ పూర్తి సామర్థ్యంతో ఆటలాడవచ్చు. ఈ ఆర్‌ఓజీ స్ర్టిక్స్‌ స్కార్‌ 17 ఎస్‌ఈ మీ లీనమయ్యే గేమ్‌ ప్లే అనుభవాలను మరో దశకు తీసుకువెళ్తాయి. ఈ ప్రత్యేక ఎడిషన్‌ ధరలు 3,59,990 రూపాయలతో ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా ఇది లభ్యమవుతుంది.

 
తాజా ఆర్‌ఓజీ స్ర్టిక్స్‌ స్కార్‌ 17 ఎస్‌ఈ మీ ఈ-స్పోర్ట్స్‌ అనుభవాలకు గేమ్‌ ఛేంజింగ్‌ మార్పులను తీసుకువస్తుంది. ఇది అల్యూమినియం లిడ్‌ను కలిగి ఉంది. ఇది నూతన కన్వర్ట్‌ డిజైన్‌ ఓవర్‌హాల్‌ను సైతం కలిగి ఉంది. అదనంగా పూర్తి సరికొత్త స్ట్రిక్స్‌ స్కార్‌ 2022 స్టాపెల్స్‌ ఇప్పుడు ప్రత్యేక ఎడిషన్‌లో సైతం అందుబాటులో  ఉంటాయి. దీనిలో హై రిజల్యూషన్‌ క్యుహెచ్‌డీ 240 హెర్ట్జ్‌ 3ఎంఎస్‌ ప్యానెల్‌ ఉంది. ఛాసిస్‌, కీ బోర్డ్‌, ట్రాక్‌ప్యాడ్‌లు స్కార్‌ 2022కు అపూర్వమైన ప్రయోజనాలనూ అందిస్తాయి. సీపీయు- జీపీయుపై లిక్విడ్‌ మెటల్‌ వినియోగించారు. స్కార్‌ ఎస్‌ఈ ఇప్పుడు నూతన వాపర్‌ ఛాంబర్‌ను పరిచయం చేసింది.

 
ఇది హీట్‌ పైప్స్‌ను  రీప్లేస్‌ చేయడంతో పాటుగా ఇది వేడిని వెదజల్లడం సైతం మెరుగుపరుస్తుంది. ఇది మదర్‌ బోర్డ్‌ ప్రాంతంలో 48.8% వరకూ కవర్‌ చేస్తుంది. నూతన ఆర్‌ఓజీ స్లాష్‌ నమూనా ఈస్టర్‌ ఎగ్‌ల సంపదను అదృశ్య సిరా కింద దాచిపెడుతుంది. వాటిలో కొన్ని మా కొత్త సిటాడెల్‌ గేమ్‌, స్కార్‌ రన్నర్‌తో అతి సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. ఇది అత్యాధునిక ఉత్పత్తి- డిస్‌ప్లే ఫంక్షనాలిటీని కలిగి ఫ్రీ-టు-ప్లే గేమ్‌గా ఉంటుంది. ఇది అసుస్‌ ఉత్పత్తులను ఇంటరాక్టివ్‌ మార్గంలో అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

 
ఈ ఆవిష్కరణ గురించి అర్నాల్డ్‌ సు, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ అసుస్‌ వద్ద మేము స్ధిరంగా ఇ-స్పోర్ట్స్‌ ప్రియుల గేమింగ్‌ ప్రయాణాన్ని పెంపొందించుకోవాలని, వృద్ధి చెందుతున్న ప్రతిభావంతులకు సరైన మౌలిక సదుపాయాలను అందించాలని  ప్రయత్నిస్తుంటాము. మా శ్రేణిలో నూతన ఆవిష్కరణలు చేస్తూ ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 17 స్పెషల్‌ ఎడిషన్‌‌ను పరిచయం చేయడం ద్వారా తనదైన స్థానం చాటుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ ఆవిష్కరణ గేమర్లకు అత్యుత్తమ అప్‌గ్రేడ్‌గా నిలువడంతో పాటుగా భారతీయ ఇ-స్పోర్ట్స్‌ పర్యావరణ వ్యవస్థను మరింతగా పెంపొందిస్తుందని భావిస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు