దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 6614 మంది కోలుకున్నారు. మరో 19 మంది మృత్యువాతపడ్డారు.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరింది. వీరిలో 4,39,00,204 మంది కోలుకున్నారు.
దేశంలో ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 5,28,090కు చేరింది. ప్రస్తుతం దేశంలో 50,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉండగా, క్రియాశీలక రేటురూ.0.11 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది.