Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. నిర్మల్‌ జిల్లాలో అత్యధిక టెంపరేచర్

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (11:19 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా, నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ యేడాది రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత ఇదేకావడం గమనార్హం. దీంతో అనేక ప్రాంతాల్లో పగటిపూట నిర్మానుష్యంగా కనిపిస్తుంది. మరో మూడు రోజులు ఇలానే ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు మరీముఖ్యంగా, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 
 
కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జంబుగ, నల్గొండ జిల్లా కట్టంగూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ఈ తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోధూరులో 44.3 డిగ్రీలు, సూర్యాపేటలో 44 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణాలోని 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నెల 19వ తేదీ తర్వా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments