Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందుల నుంచి హైదాబారాబాద్‌కు కదిలిన అవినాష్ రెడ్డి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:10 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోమారు పిలుపువచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ నగరానికి బయలుదేరారు. ఆయన వెంట వైకాపాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు భారీగా వైకాపా నేతలు కూడా హైదరాబాద్ నగరానికి కదిలారు. సీబీఐ అధికారుల పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో నాలుగుసార్లు విచారించిన సీబీఐ అధికారులు.. సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేశారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడంతో వైకాపా శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 
 
వైఎస్‌ భాస్కర్ రెడ్డిని ఆదివారం పులివెందులలో అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్‌లోని సీబీఐ జడ్జి నివాసంలో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్‌ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. 
 
హత్య తర్వాత సహనిందితులు డి.శివశంకర్‌ రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో కలిసి ఆధారాల్ని చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్‌ రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments