తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా వున్నాయి. నిర్మల్ జిల్లాలో భానుడు భగభగమన్నాడు. దస్తూరాబాద్ మండలంలో ఏకంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఈ నెల 19 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.