ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏడుగురు మహిళల్ని..?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (08:20 IST)
ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. గతంలో అతను మరో ఏడుగురు మహిళలను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా గుర్తించారు.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 17వ తేదీ మంగళవారం డోకూర్‌ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అంతేకాదు,గతంలో జరిగిన ఏడు హత్యలతో అతనికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
 
డోకూర్‌లోని కల్లు కాంపౌండ్‌లో నిత్యం మద్యం సేవించే సదరు నిందితుడు..అక్కడ కల్లు తాగేందుకు వచ్చే మహిళలతో మాట కలిపేవాడు. ఆపై వారిని తనతో తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసేవాడు. అలా అతని చేతిలో ఇప్పటివరకు ఏడుగురు మహిళలు బలయ్యారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు..
 
ఈ నేరాలన్నీ ఒక్కడే చేశాడా..? లేక అతనితో పాటు మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

Raveena Tandon : జయ కృష్ణ ఘట్టమనేని కి జోడీగా రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ పరిచయం

రణబాలి, రౌడీ జనార్థన చిత్రాలతో అలరించనున్న విజయ్ దేవరకొండ

Rajamouli: మహేష్ బాబు.. వారణాసి చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

తర్వాతి కథనం
Show comments