Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీలో అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (08:16 IST)
దిల్లీలోని కిరారి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వస్త్ర గోదాంలో సోమవారం వేకువజామున భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
 
 డిసెంబర్‌ 8న అనాజ్‌మండీ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు దిల్లీ ప్రభుత్వం రూ.2లక్షలు, కేంద్ర రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ఘటన మరువక ముందే మరో భారీ ప్రమాదం సంభవించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments