రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ సోదరుడు తాను దాచుకున్న డబ్బుతో అక్కకు తులాభారం నిర్వహించాడు. ఇది అక్కా తమ్ముళ్లకు మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఆత్మీయ పండుగగా జరుపుకుంటున్నారు. ఈ రాఖీ పండుగను పురస్కరించుకుని తమ్ముడికి అక్క రాఖీ కట్టింది. దీంతో అక్కకు తన వంతు సాయంగా దాచుకున్న డబ్బుతో రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన అక్కకు తులాభారం చేశాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన ఖమ్మం జిల్లాలోని శ్రీశ్రీ సర్కిల్‌కు చెందిన బోలగాని బసవ నారాయణ, అరుణ దంపతుల ఇంట జరిగింది.
ఈ దంపతులకు రణశ్రీ, త్రివేది అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రణశ్రీకి గత యేడాది వివాహం జరిగింది. వివాహం తర్వాత వచ్చిన తొలి రాఖీ పండుగ అక్కకు జీవితాంతం ఉండిపోవాలని భావించాడు తమ్ముడు. తన కొడుకు అక్కపై ఇంత అభిమానాన్ని చూపడం కోసం తాను చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బును ఐదు రూపాయల నాణేలుగా మార్చి అక్కకు తులాభారం నిర్వహించాడు.
ఈ తులాభారంలో 11200 ఐదు రూపాయల కాయిన్స్ తూకంగా వేశాడు. వాటి విలువ రూ.56 వేల రూపాయలు. వీటిని కానుకగా ఇచ్చారు. ఈ తులాభార వేడుకకు తమ బంధువులు, స్నేహితులు పిలిపించుకుని ఘనంగా నిర్వహించారు.