తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (09:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో అమరావతి మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలుగు ప్రజలకు హెచ్చరిక చేసింది. హైదరాబాద్ ప్రజలు రానున్న రెండు రోజుల్లో బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 24, 25 తేదీలలో ఉరుములు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
అందుచేత అవసరమైతే ప్రజలు ఇంటి నుంచి బయటకి రావాలని హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు కాస్త జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments