Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింబయోసిస్‌ యుజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు: నమోదు చేసుకోవడానికి ఆఖరు తేదీ 12 ఏప్రిల్‌ 2023

exam
, గురువారం, 23 మార్చి 2023 (21:35 IST)
సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌ యూనివర్శిటీ) (ఎస్‌ఐయు)లో సింబయోసిస్‌ ప్రవేశ పరీక్ష (SET) 06 నుంచి 14 మే 2023 వరకూ జరుగనుందని  యూనివర్శిటీ వెల్లడించింది. పలుమార్లు ఈ ప్రవేశపరీక్షలలో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎస్‌ఐయు పరిధిలోని 16 ఇనిస్టిట్యూట్‌లలో అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను పొందే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్‌లలో మేనేజ్‌మెంట్‌, లా, ఇంజినీరింగ్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, ఎకనామిక్స్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, ఐటీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, అప్లయ్డ్‌ స్టాటిస్టిక్స్‌, డాటా సైన్స్‌లో చేరవచ్చు. సెట్‌ (సింబయోసిస్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ) 2023 ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 12 ఏప్రిల్‌.
 
సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌ యూనివర్శిటీ) వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రజనీ గుప్తే మాట్లాడుతూ, ‘‘మన దేశ విద్యావిధానాన్ని సమూలంగా జాతీయ విద్యావిధానం 2020 మార్చనుంది. అభివృద్ధి, సౌకర్యం, నూతన తరపు అభ్యాస పరంగా నూతన శిఖరాలకు ఇది తీసుకువెళ్లనుంది. సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ వద్ద మేము ఇప్పటికే ఎన్‌ఈపీ 2020 నిర్ధేశించిన లక్ష్యాలకనుగుణంగా కార్యక్రమాలను ప్రారంభించాము. మా పలు ప్రోగ్రామ్‌లను సమగ్రమైన,  మల్టీడిసిప్లీనరీ విద్యను విద్యార్దులకు అందించనున్నాయి’’ అని అన్నారు.
 
మరింతగా SET, SLAT (SET-Law), and SITEEE (SET-Engineering), విభజించిన ఈ పరీక్షలలో విద్యార్ధులు ఒకటి కంటే ఎక్కువగా దరఖాస్తును set-test.org. వద్ద చేసుకోవచ్చు. SET/SLAT/SITEEE రిజిస్ట్రేషన్‌ ఫీజు 1950 రూపాయలు కాగా ఒక్కో ప్రోగ్రామ్‌కూ 1000 రూపాయలను రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందంగా ఉన్నవాళ్లకు ఎక్కువ జీతం వస్తుందా?