Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహార ధాన్యాల పరంగా స్వీయ సమృద్ధి పరంగా శాస్త్రి గారికి దేశం ఋణపడి ఉంది: నరేంద్ర సింగ్‌ తోమార్‌

Sastri
, గురువారం, 23 మార్చి 2023 (23:32 IST)
ప్రపంచ నీటి దినోత్సవం 2023 సందర్భంగా, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖామాత్యులు శ్రీ నరేంద్ర సింగ్‌ తోమార్‌, దివంగత భారత ప్రధాని- భారతరత్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి నాయకత్వాన్ని వేనోట పొగిడారు. ప్రధానమంత్రి నివాసంలో వ్యవసాయం చేయడానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలు భారతీయ రైతులు ఇప్పుడు ఆహార ధాన్యాల పరంగా స్వీయ సమృద్ధి సాధించడంలో స్ఫూర్తినందించాయన్నారు.
 
శాస్త్రిగారి వ్యక్తిత్వానికి సాటి ఎవరూ లేరు. 1965లో ఆహార సంక్షోభం ఎదురైనప్పుడు ఆయన తన అధికారిక నివాసంలో వ్యవసాయం చేయడం మాత్రమే కాదు,  మన దేశ రైతులను జై జవాన్‌, జై కిసాన్‌ నినాదంతో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాల్సిందిగా పిలుపునిచ్చిన ఆయన ఇప్పుడు దేశం స్వీయ సమృద్ధి సాధించడంలోనూ తోడ్పడ్డారు. ఆయనను ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి పిలుపుకు స్పందించి ఎంతోమంది గ్యాస్‌ సబ్సిడీని వదులుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.
 
ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని ధనూక గ్రూప్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తోమార్‌ పాల్గొనడంతో పాటుగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్ర పటం ఆవిష్కరించారు. దీనితో పాటుగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనవడు శ్రీ సంజయ్‌ నాథ్‌ సింగ్‌ రచించిన పుస్తకాన్ని సైతం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌ శాస్త్రి, మనవళ్లు సిద్ధార్ధ నాథ్‌ సింగ్‌; విభాకర్‌ శాస్త్రితో పాటుగా ధనూక గ్రూప్‌ ఛైర్మన్‌ ఆర్‌ జి అగర్వాల్‌ పాల్గొన్నారు. జై జవాన్‌, జై కిశాన్‌ స్లోగన్‌తో కూడిన ఈ నూతన చిత్ర పటాన్ని పార్లమెంట్‌ సభ్యులందరికీ అందజేయనున్నారు.
 
ఈ సందర్భంగా ధనూక గ్రూప్‌ ఛైర్మన్‌ ఆర్‌ జి అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో 70-80% నీటిని వ్యవసాయ అవసరాల కోసం వాడుతున్నారని అంచనా. భూగర్భ జలాలు తరిగే కొద్దీ, డ్రిప్‌ మరియు స్ర్పింక్లర్‌ సాంకేతికతలను వినియోగించాల్సి ఉంది. ఈ తరహా సాంకేతికతలతో ఇజ్రాయిల్‌ లాంటి దేశాలు అత్యున్నతతో  కూడిన ఉత్తమ దిగుబడులు సాధిస్తున్నాయి. మనం కూడా ఆ తరహా సాంకేతికతలను స్వీకరించాల్సి ఉంది’’ అని అన్నారు. మన పంటల విధానాలను మార్చుకుంటే మరింత ప్రయోజనముంటుందని ఐసీఏఆర్‌-ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ, జాయింట్‌ డైరెక్టర్‌ (ఎక్స్‌టెన్షన్‌) డాక్టర్‌ రవీంద్రనాథ్‌ పడారియా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాలూ కుమారుడికి కలలో కృష్ణుడి విశ్వరూపం దర్శనం.. ఆడుకుంటున్న నెటిజన్లు (Video)