Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఏంటిది? ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నా... ఎవరు?

కాపులను బిసీల్లో చేరుస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. నమ్మించి బాబు గొంతు కోశారని టిడిపిలో ఉన్న బిసి సంఘాలన్నీ ఐక్యంగా బాబుపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నాయి. బాబు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాల నేతలు పెద్

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (16:14 IST)
కాపులను బిసీల్లో చేరుస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. నమ్మించి బాబు గొంతు కోశారని టిడిపిలో ఉన్న బిసి సంఘాలన్నీ ఐక్యంగా బాబుపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నాయి. బాబు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాల నేతలు పెద్దయెత్తున ఆందోళన చేస్తుంటే బిసి సంఘాలకు చెందిన ప్రధాన నాయకులు మాత్రం నోరు విప్పలేదు. 
 
అయితే మొదటిసారి జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య ఈ విషయంపై స్పందించారు. బిసిలకు అన్యాయం జరిగే పరిస్థితి కనబడుతోందని, దీన్ని ఎండగట్టాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు క్రిష్ణయ్య. ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు క్రిష్ణయ్య. ఇప్పటికే రేవంత్ రెడ్డి టిడిపి పార్టీని వదిలివెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేని టిడిపి నాయకులు తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్థమవుతుండడంతో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయారు. బి.సి.నేత క్రిష్ణయ్యను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలే రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments