Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆపేయమన్నదా? ఏపీ సీఎం అలా ఎందుకన్నారు?

కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైత

పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆపేయమన్నదా? ఏపీ సీఎం అలా ఎందుకన్నారు?
, గురువారం, 30 నవంబరు 2017 (19:25 IST)
కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా జరిగిందా? ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనం సృష్టిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో రైతుల కలలు సాకారమవుతాయని అనుకుంటుంటే, కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి పోలవరం ప్రాజెక్టు కోసం పిలిచిన టెండర్లను ఆపేయాలంటూ తమకు లేఖ రాశారన్నారు. 
 
ఈ లేఖతో పోలవరం ప్రాజెక్టు పనులు అయోమయంలో పడ్డాయన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే మూడో పార్టీకి అప్పంగిచాల్సిన పరిస్థితి వున్నదన్నారు. ఒకవేళ కేంద్రమే పోలవరం పూర్తి చేయాలనుకుంటే తాము కూడా సహకరిస్తామని తెలిపారు. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టులో భాగంగా 60 వేల ఎకరాల భూములను సేకరించాల్సి వుందని అన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చిన లేఖతో గందరగోళం తలెత్తిందనీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విదేశీ ప్రయాణం ముగించుకుని రాగానే ఆయనతో భేటీ అవుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలు వద్దు... అనుకున్నవారు ఆ ఊయలలో వేస్తే చాలు...