Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థుల ఆత్మహత్యలకు కళాశాలలదే బాధ్యత : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా సంబంధిత కళాశాల యాజమాన్యమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertiesment
AP CM Chandrababu Naidu
, బుధవారం, 29 నవంబరు 2017 (18:54 IST)
రాష్ట్రంలో ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా సంబంధిత కళాశాల యాజమాన్యమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అంశంపై 344 నిబంధన కింద శాసనసభలో సభ్యులు అనిత, శేషారావు, గీత, ఆదిత్య, అప్పలనాయుడు, విష్ణుకుమార్‌రాజు ప్రస్తావించిన అంశంపై ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. 
 
కళాశాలలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని కళాశాలలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి వారిని రోబోలుగా మార్చడం సరికాదన్నారు. విద్యార్థుల్లో మాసనిక ఒత్తిడిని తగ్గిచేందుకు ఆనంద ఆదివారాల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
కాగా, చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న పి. నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆనవాయితీగా మారింది. దీనిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం ఎక్కడా సూటిగా స్పందించలేదు. ఇపుడు కూడా అలాగే, దాటవేత ధోరణితోనే సమాధానమిచ్చాని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమాజంలో లింగభేదం ఉండరాదు : మానుషి