Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరు బావిలో బాలుడు మృతిపై హెచ్ఆర్సిలో పిటిషన్

Webdunia
గురువారం, 28 మే 2020 (21:35 IST)
మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం పోడ్చన్ పల్లిలో మూడేళ్ళ బాలుడు వర్ధన్ బోరు బావిలో పడి చనిపోయిన ఘటనలో రెవెన్యూ శాఖ అధికారులను బాధ్యులను చేయాలని బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సిలో పిటిషన్ దాఖలు చేసింది.
 
బోరు బావుల్లో పిల్లలు పడటం, యంత్రాంగం అంతా చేరి పిల్లలను పైకి తీసే ప్రయత్నం చేయడం, చివరకు పిల్లల శవాలే పైకి తేవడం ప్రహసనంగా మారిందని బోరు బావికి అనుమతి ఇచ్చే అధికారులు కేవలం డబ్బు కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇచ్చి ఆ బోర్ విఫలమైతే దానిని వెంటనే మూసి వేయడానికి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు.
 
పనికిరాని బోరుబావులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని బోరు బావి వేసే రిగ్ యజమానులు సైతం నిరర్థక బోరు బావుల మూసివేతలో విఫలమౌతున్నారని వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మృతి చెందిన బాలుడి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments