Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు చెల్లించి శవాన్ని తీసుకెళ్లండి: కాప్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:56 IST)
కోవిడ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు గుంజుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులైతే రోగి చనిపోయాక కూడా బిల్లు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామని మొండికేస్తున్నాయి. 
 
తాజాగా మేడ్చల్ జిల్లాలోని నాగరం మునిసిపాలిటీలోని రాంపల్లికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు వాసు ఐదు రోజుల క్రితం కరోనావైరస్‌తో బాధపడుతూ కాప్రాలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఐదు రోజులుగా అతడి చికిత్స కోసం లక్షన్నర రూపాయలు చెల్లిస్తూ వచ్చారు. ఐతే అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం నాడు కన్నుమూశాడు.
 
దీనితో మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు ఆసుపత్రికి వచ్చారు. ఐతే మరో రెండు లక్షలు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గం చెప్పింది. చనిపోయిన తర్వాత బిల్లు ఎందుకు కట్టాలంటూ మృతుడి బంధువులు నిలదీశారు. డబ్బు కట్టి తీసుకెళ్లండి, వాగ్వాదం వద్దని వాసు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీనితో అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో నిరసనలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments