తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (12:11 IST)
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా ఆయన జాగరణ దీక్షను తలపెట్టారు. దీనికి రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 
 
పైగా, ఆయన తన నివాసంలోనే ఈ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నివాసంలోనే దీక్షకు దిగగా, దీన్ని పోలీసులు భగ్నం చేశారు. అదేసమయంలో ఆయన్ను అరెస్టు చేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టు వదలకుండా ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అరెస్టు చేశారు. 
 
ఒకవైపు కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ అనుమతి లేకున్నప్పటికీ దీక్ష చేయడానికి పూనుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అందుకే ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments