Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో చోరీకి వచ్చాడు.. రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు..

Webdunia
గురువారం, 6 మే 2021 (19:10 IST)
చోరీకి పాల్పడి ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. నిజామాబాద్‌ రూరల్‌ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుఖ్‌జిత్‌ ఫ్యాక్టరీ ప్రధాన గేట్‌ పక్కన గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. అయితే ఆలయం రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు. ఆలయంలో చోరీ చేయడానికి ఓ వ్యక్తి గోడపై నుంచి లోపలికి వెళ్లడానికి యత్నించాడు.
 
ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆలయం రేకుల మధ్య దొంగ ఇరుక్కుపోయాడు. రేకుల మధ్య ఉన్న నిందితుడిని చూసి పక్కన ఉన్న కొందరు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని బయటకు తీశారు. 
 
అనంతరం నిందితుడిపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. నిందితుడిని ఆర్మూర్‌ మండలం మామిడిపల్లికి చెందిన రఘుగా గుర్తించామన్నారు. కాగా నిందితుడు రఘుపై ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments