Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకల్లోతు ప్రేమలో షకీలా... బాయ్‌ఫ్రెండ్ వివరాలు వెల్లడించిన శృంగారతార!

Advertiesment
పీకల్లోతు ప్రేమలో షకీలా... బాయ్‌ఫ్రెండ్ వివరాలు వెల్లడించిన శృంగారతార!
, గురువారం, 6 మే 2021 (11:37 IST)
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో శృంగార తారగా గుర్తింపు పొందిన నటి షకీలా. నెల్లూరుకు చెందిన ఈమె కేరళ రాష్ట్రానికి వెళ్లి స్థిరపడిపోయింది. దీంతో ఈమెను ప్రతి ఒక్కరూ కేరళ నటిగా భావిస్తుంటారు. 43 యేళ్ళ షకీలా ఇపుడు ప్రేమలోపడింది. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతోంది. ముఖ్యంగా, తనకంటే 13 యేళ్ళ చిన్నవాడైన వ్యక్తితో పీకల్లోతు ప్రేమలోవుంది. 
 
గత 90ల కాలంలో వెండితెర‌పై శృంగార పాత్ర‌లు పోషించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన షకీలా.. స్టార్ హీరోల‌కు స‌మానంగా పాపులారిటీ ద‌క్కించుకుంది. ఆమెకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగా ఉండేది. అయితే, ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో పాటు, వ్య‌క్తిగ‌త జీవితంలోను అనేక ఒడిదుడుకులు ఎదురు కావ‌డం ష‌కీలాని తీవ్ర సంక్షోభానికి గురిచేసింది. 
 
ఇటీవలే ఇంద్రజిత్‌ లంకేష్‌.. షకీలా జీవితాల‌కు సంబంధించిన విశేషాల‌ను సినిమాగా రూపొందించి ఐదు భాష‌ల‌లో రిలీజ్ చేశాడు. ష‌కీలా ఇప్ప‌టికీ సింగిల్‌గానే ఉంద‌ని, ఆమెకు తోడుగా మిల్లా అనే ద‌త్తపుత్రిక ఉంది. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో త‌న‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడ‌నే విష‌యం వెల్ల‌డించింది. 
 
ఇప్పుడు నేను ఒక‌రితో ప్రేమ‌లో ఉన్నాను. ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం. నా వ‌య‌స్సు ఇప్పుడు 43 ఏళ్లు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నా బాయ్ ఫ్రెండ్ (30) నా క‌న్నా చిన్న వాడు. ఏజ్‌ అనేది జస్ట్‌ నెంబర్‌ మాత్రమే. 
 
అయినా నేను పెళ్లైన వ్యక్తితో లవ్‌లో లేను కదా అతని ఫ్యామిలీని డిస్ర్టబ్‌ చేయడానికి. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇందులో తప్పేం ఉంది. . గతంలోనూ తనకు బాయ్‌ ప్రెండ్స్‌ చాలామందే ఉన్నారు. అయితే వాళ్లు అందరూ ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్లిపోయారని ష‌కీలా చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలీవుడ్‌ను పగబట్టిన కరోనా వైరస్ : మరో కమెడియన్ మృతి