Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... హైదరాబాదుకు నిపా వైరస్...?(నిపా వీడియో)

నిపా వైరస్ పేరు చెబితే ఇప్పుడు అంతా హడలిపోతున్నారు. ఎందుకంటే ఆ వైరస్ సోకిందంటే ఇక దానికి విరుగుడు అనేది లేకపోవడమే. మందులేవీ ఆ వ్యాధికి పనిచేయవు. దానితో రోగి 24 గంటల్లోనే చనిపోతున్నాడు. కేరళలో ఇప్పటికే

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (13:30 IST)
నిపా వైరస్ పేరు చెబితే ఇప్పుడు అంతా హడలిపోతున్నారు. ఎందుకంటే ఆ వైరస్ సోకిందంటే ఇక దానికి విరుగుడు అనేది లేకపోవడమే. మందులేవీ ఆ వ్యాధికి పనిచేయవు. దానితో రోగి 24 గంటల్లోనే చనిపోతున్నాడు. కేరళలో ఇప్పటికే ఈ వైరస్ 12 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ నేపధ్యంలో ఇటీవలే కేరళకు వెళ్లి వచ్చిన ఓ హైదరాబాదీతో పాటు మరో వ్యక్తికి ప్రాణాంతక నిపా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. 
 
రోగుల వివరాలను అడగ్గా వారు ఇటీవలే కేరళ వెళ్లివచ్చినట్లు తేలింది. దీనితో వారి రక్త నమూనాలను పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఐతే ఆస్పత్రిలో చేరిన వీరిరువురూ కేరళలో నిపా వైరస్ వ్యాప్తి చెందిన కోజీకోడ్‌కు దూరంగా వున్నారనీ, దాదాపు వారికి ఆ వైరస్ సోకే అవకాశం లేదనీ, ఏదేమైనప్పటికీ పరీక్షల కోసం వారి రక్త నమూనాలను పంపినట్లు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి తెలిపారు.
 
విస్తరిస్తున్న నిపా... 
ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళ సరిహద్దులను దాటి... కర్ణాటకలో తళుక్కమన్న నిపా వైరస్.. ఇపుడు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సర్కారులు అప్రమత్తమయ్యాయి. ఆ వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే వారికి చికిత్స కోసం ప్రధాన ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. 
 
ఐపిఎం ఆధ్వర్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ, నిలోఫర్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో వార్డులను ఏర్పాటు చేసి 5 నుంచి 8 పడకలు నెలకొల్పనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి నియంత్రణకు మూత్ర, రక్త నమునాలు సేకరిస్తామని మంత్రి చెప్పారు. సెలెబ్రో స్పైనల్‌ ఫ్లూయిడ్‌ (సీఎస్‌ఎఫ్‌) నమునాలు సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
 
నిపా వైరస్ లక్షణాలు... 
* నిపా వైరస్‌ ముదరడానికి 7 నుంచి 14 రోజుల సమయం పడుతుంది.
* అప్పటి నుంచి శరీరంలో వేగంగా మార్పులు కనిపిస్తాయి.
* జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, లో బీపీ, కోమాలోకి వెళ్లడం. 
* మెదడువాపు, శ్వాసకోశసం బంధిత సమస్యలు వస్తాయి.
* ప్రత్యేక పరీక్ష ద్వారా నిర్ధారణ. 
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? 
* పందులు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి. 
* పచ్చి పండ్లను తినకూడదు. 
* తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 
* పూర్తిగా ఉడికిన మాంసమే తినాలి. 
* శుభ్రంగా కడిగిన, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తినడం మంచిది. 
* బయట వండిన మాంస పదార్థాలను తీసుకోవద్దు. 
* వ్యాధి లక్షణాలు కనిపించినట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించాలి.
వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments