Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాయ మాటలతో 11 ఏళ్ల బాలికను అనుభవించిన ఐదుగురు యువకులు.. చెబితే చంపేస్తామంటూ...

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. భగతసింగ్ కాలనీలో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అయిదుగురు దుర్మార్గులు. చంటి, అరవింద్‌తో పాటు సైఫుల్లా, మన్సూర్, సైదులు గత కొద్ది రోజులుగా మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తున్నారు. నిన్న ర

Advertiesment
మాయ మాటలతో 11 ఏళ్ల బాలికను అనుభవించిన ఐదుగురు యువకులు.. చెబితే చంపేస్తామంటూ...
, గురువారం, 24 మే 2018 (16:28 IST)
చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. భగతసింగ్ కాలనీలో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అయిదుగురు దుర్మార్గులు. చంటి, అరవింద్‌తో పాటు సైఫుల్లా, మన్సూర్, సైదులు గత కొద్ది రోజులుగా మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తున్నారు. నిన్న రాత్రి స్థానికులు బాలికను మసీదు పెద్దల వద్దకు తీసుకెళ్లి పిర్యాదు చేశారు. ఆ తరువాత మసీదు పెద్దలతో కలిసి పిఎస్‌కు వెళ్లి  పోలీసులకు పిర్యాదు చేశారు.
 
ఐతే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో భగత్ సింగ్ కాలనీకి వెళ్లి ఐదుగురు యువకులను పట్టుకొని చావబాదారు స్థానికులు. ఆ తరువాత ఘటనా స్థలానికి చేసుకున్నారు పోలీసులు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
 
తొలుత ఐదుగురు యువకులు కలిసి బాలికను మాయచేసి లొంగదీసుకున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక విషయం తల్లికి తెలియచేయటంతో భర్త లేని ఆమె తమ్ముడు ద్వారా తమ ముస్లిం మసీదు కమిటీ ద్వారా పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితులలో ఇద్దరికి రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ వేదికగా 'స్వామి' బలపరీక్ష - కన్నడ సభలో ఏం జరగబోతుంది?