Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ను ఇరికించిన కవిత.. అభివృద్ధిలో పక్షపాతం చూపించవద్దని?

అవును.. ఎంపీ కవిత.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఇరికించారు. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్‌కే పరిమితమైందని ప్రస్తుతం అన్నీ జిల్లాలకు ఐటీ విస్తరిస్తుందని కవిత చెప్పారు. ఐటీలో కొత్త ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (17:15 IST)
అవును.. ఎంపీ కవిత.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఇరికించారు. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్‌కే పరిమితమైందని ప్రస్తుతం అన్నీ జిల్లాలకు ఐటీ విస్తరిస్తుందని కవిత చెప్పారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆమె ఆకాక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 
 
అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. అన్నయ్య కేటీఆర్‌కు కొన్ని విజ్ఞప్తులు చేశారు. తన అన్నయ్య కేటీఆర్‌ను అభివృద్ధిలో పక్షపాతం చూపించవద్దని ఇరికించారు. 
 
అన్నయ్య కేటీఆర్ దృష్టి ఎప్పుడూ తన ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంటుందని.. జర ఆ ప్రేమను చెల్లెలు ప్రాతినిధ్యం వహించే నిజామాబాద్ పైనా చూడాలని సభాముఖంగా కోరుతున్నానని విన్నవించారు. ఇక నిజామాబాద్‌లో స్పోర్ట్స్ స్టేడియం, బస్టాండ్, ఎయిర్‌పోర్టు, మహిళల కోసం స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోందని కవిత తెలిపారు. 
 
ఇలా బహిరంగ సభలో అభివృద్ధి విషయంలో కేటీఆర్ పక్షపాతం చూపిస్తున్నారని కవిత వ్యాఖ్యానించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. కానీ అభివృద్ధి పరంగా ఆమె కేటీఆర్‌ను సమయస్ఫూర్తితో ఇరికించిందని గులాబీ నేతలు కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments