గ్రీన్ ఛాలెంజ్.. సితారతో కలిసి మొక్కలు నాటిన మహేష్ బాబు
						
		
						
				
తెలంగాణ హరితహారంలో భాగంగా ఎంపీ కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జక్కన్న రాజమౌళి వంటి ప్రముఖులు చెట్లను నాటారు. ఇతరుల
			
		          
	  
	
		
										
								
																	తెలంగాణ హరితహారంలో భాగంగా ఎంపీ కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జక్కన్న రాజమౌళి వంటి ప్రముఖులు చెట్లను నాటారు. ఇతరులకు గ్రీన్ ఛాలెంజ్ సవాల్ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. 
	
	 
	కేటీఆర్ సవాలును స్వీకరించిన మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. తనను ఇలాంటి ఛాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తన ముద్దుల కూతురు సితార, కొడుకు గౌతంతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపెల్లికి ఆయన హరితహారం గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమాను వంశీ పైడిపెల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.